ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కార్యాలయం వద్ద సినీ కార్మికులు నిరసన

 

ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద 24 యూనియన్లకు చెందిన సినీ కార్మికులు ఆందోళనకు దిగారు. వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున కార్మికులు నినాదాలు చేశారు.  నిరసనలో 24 యూనియన్ల సినీ కార్మికులు  పాల్గొన్నారు.  శనివారం నిర్మాతలు, కార్మిక సంఘాలు చర్చలు జరపగా మూడు కేటగిరీలుగా విభజించి, కార్మికుల వేతనాల్ని పెంచాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. న్యాయమైన పద్దతిలో వేతనాలు పెంచలని డిమాండ్ చేస్తున్నాయి. రేపటి నుంచి చిత్రీకరణలు పూర్తిగా నిలిపేస్తున్నట్లు ఫిల్మ్ ఫేడరేషన్ అధ్యక్షుడు అనిల్ ప్రకటించారు. ఇప్పటికే షేడ్యూల్ ఉంటే 2 రోజులు సమయమిస్తామని, ఆతర్వాత అవి కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు.

నిన్న జరిగిన  సమావేశంలో నిర్మాతలు రెండు రకాల వేతన పెంపు విధానాలను ప్రకటించారు. రోజుకు రూ. 2000 లేదా అంతకంటే తక్కువ వేతనం తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 15 శాతం, రెండవ ఏడాది 5 శాతం, మూడవ ఏడాది మరో 5 శాతం చొప్పున వేతనం పెంచడానికి సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా, రోజుకు రూ. 1000 లేదా అంతకన్నా తక్కువ వేతనం పొందుతున్న కార్మికులకు మొదటి ఏడాది 20 శాతం, మూడవ ఏడాది 5 శాతం పెంచనున్నట్లు తెలిపారు. అయితే, వీరికి రెండవ ఏడాది వేతన పెంపు ఉండదని స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu