జ‌య‌హో ష‌మీ..4 ప‌రుగులు 4 వికెట్లు..!

సినిమాల‌కు మించిన ట్విస్టులు రాజ‌కీయాల‌కు మంచిన ప్ర‌క‌ట‌న‌లు క్రికెట్‌లో జ‌రిగిపోతున్నాయి. భార‌త్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ఫిట్నెస్ కార‌ణంగా జ‌ట్టులో ఉంటాడా ఉండ‌డా అన్న సందేహాలు పెరిగిపోయా యి. అత‌ని స్థానంలో మ‌రో యువ పేస‌ర్‌కి ఛాన్స్ ఇవ్వాల‌నే జ‌ట్టు కెప్టెన్‌తో స‌హా అంటూ వ‌చ్చారు. అందు కు బోర్డు నిర్ణ‌యం కూడా జోడ‌యింది. కానీ ఎట్ట‌కేల‌కు ష‌మ్మీని టీ.20 ప్ర‌పంచ‌క‌ప్‌కి ఆస్ట్రేలియాకి పంపారు. అయినా చాల‌మంది అత‌ని ఫిట్నెస్ మీద అనుమానం వ్య‌క్తం చేస్తూనే ఉన్నా రు. వీట‌న్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు ష‌మీ. సోమ‌వారం ఆసీస్‌తో త‌ల‌ప‌డిన వామ‌ప్ మ్యాచ్‌లో చివ‌రి 20వ ఓవ‌ర్లో వ‌చ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీసుకుని ఆసీస్‌ని, భార‌త్ క్రికెట్ వీరాభిమానుల‌ను ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. 

ఎలా సాధ్యం.. ఏద‌యినా ఏ క్ష‌ణాన్నయినా జ‌ర‌గ‌వ‌చ్చ‌న‌డానికి ఇదో పెద్ద ఉదాహ‌ర‌ణ‌. కె.ఎల్. రాహుల్ (57), సూర్యకుమార్ యాద‌వ్ (50) ధ‌నాధ‌న్ బ్యాటింగ్ చేసి అర్ధ‌సెంచ‌రీల‌తో ఆసీస్‌కి చుక్క‌లు చూపించా రు. వారి బ్యాటింగ్ ధాటితో భార‌త్ 7 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది. ఆసీస్ కూడా బాగానే ఆడింది. కానీ వారి ఆశ‌లు చివ‌రి ఓవ‌ర్లోనే దెబ్బ‌తిన్నాయి. అదీ ష‌మీ రాక‌తో. అప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం ఫీల్డ‌ర్‌గానే క‌న‌ప‌డు తున్న ష‌మీకి బంతి ఎప్పుడిస్తాడ‌ని అంద‌రూ కెప్టెన్ని తిట్టుకునే ఉంటారు. కానీ ఊహించ‌ని విధంగా ప‌రి స్థితులు బేరీజు వేసి లాభంలేద‌నుకున్నాడో ఏమో చివ‌రి 20వ ఓవ‌ర్లో ష‌మీకి బంతి ఇచ్చారు.
 
జులై త‌ర్వాత మ‌ళ్లీ టీమ్ ఇండియాకి ఆడ‌టం ఇదే మొద‌లు. కోవిడ్‌తోనూ, ఫిట్నెస్ స‌మ‌స్య‌ల‌తోనూ జ‌ట్టు కు ష‌మీ దూర‌మ‌య్యాడు. కానీ వాటిని అధిగ‌మించి జ‌ట్టులోకి వ‌చ్చినా అంత ప్ర‌తిభ‌ను తిరిగి ప్ర‌ద‌ర్శి స్తాడా అన్న అనుమానం అంద‌రికీ ఉంది.  కానీ ఇక్క‌డ ఈ వామప్ మ్యాచ్‌లో అత‌ని సామ‌ర్ధ్యం అనుమానా ల‌ను ప‌టాపంచ‌లు చేసింది. యార్క‌ర్ల‌తో ఆసీస్ బ్యాట‌ర్ల‌ను పెవిలియ‌న్ దారి ప‌ట్టించ‌డంలో గొప్ప నైపు ణ్య‌మే ప్ర‌ద‌ర్శించాడు. మొద‌టి రెండు బంతుల‌కీ రెండేసి పరుగులు ఇచ్చి త‌ర్వాత నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. 

ఈ మ్యాచ్‌లో మ‌రో అద్భుతం కింగ్ కోహ్లీ సూప‌ర్ క్యాచ్‌. పాట్ క‌మిన్స్ సిక్స్ కొట్టాన‌ని తెగ సంతోష‌ప‌డు తు న్న త‌రుణంలోనే ఆ సంతోషం ఆ క్షణంలోనే తొల‌గిపోయింది. కింగ్ బౌండ‌రీ లైన్లో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ప‌ట్టి క‌మిన్స్ పెవిలియ‌న్ దారి ప‌ట్టించాడు. అత‌ని ఆ ఫీట్ కి కెప్టెన్ తో పాటు ప్రేక్ష‌కులూ ఫిదా అయ్యారు. మ‌రి కింగ్ కోహ్లీనా మ‌జాకా.. అన్నారంతా! 
టోర్నీలో ఆరంభ‌మ్య‌చ్ ఈ నెల 23న భార‌త్ పాకిస్తాన్ త‌ల‌ప‌డ‌తాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu