సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో

 

 

 

సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి జైరాం, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, ఆనం తదితరులు హజరయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ... టిడిపి, వైకాపా మేనిఫెస్టోలను నమ్మవద్దని అన్నారు. జగన్ అధికారంలో లేనప్పుడే లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఐదు సంతకాలతో రాష్ట్రాన్ని అమ్మేస్తారని విమర్శించారు.

 

ఏపీ మేనిఫెస్టో ముఖ్యాంశాలు :

* ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు రోజుల పనిదినాలు
* రిటైర్‌మెంట్ వయసు 60 ఏళ్లకు పెంపు
* రూ.5వేల కోట్లతో రైతుల అత్యవసర సహాయనిధి ఏర్పాటు
* వ్యవసాయానికి 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఏర్పాటు
* వచ్చే ఐదేళ్లు విద్యుత్ చార్జీలు పెంపు ఉండదు
* రైతుల నుంచి ధాన్యం సేకరణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు
* కృష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధానం చేస్తాం
* విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు
* ప్రతి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు
* ప్రధాన ఓడరేవులకు అనుబంధంగా షిప్పింగ్ హార్బర్
* పేదలకు జనతా వస్తాల పంపిణీ
* వితంతు, వృద్ధులకు రూ.వెయ్యి పెన్షన్
* వికలాంగులకు రూ.1500 పెన్షన్
* ప్రభుత్వ ఇంటర్ కాలేజీ విద్యార్థులకు లాప్‌టాప్‌లు
* జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీలు
* ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు
* స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ
* ఆడపిల్ల పుడితే 100 గజాల స్థలం ఇస్తాం
* బెల్టు షాపులు మూయిస్తాం
* 100 యూనిట్లలోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్
* డిష్ కనెక్షన్‌తో ఉచిత కలర్ టీవీలు ఇస్తాం