సవ్లే బచ్చే కో గోరీ బచ్చీ... మస్లే కో సమ్జో నవ్ జవానో 

సిరాజ్ కు 30 ఏళ్లు నిండాయి. ఎన్ని సంబంధాలు వచ్చినా  పెళ్లి చేసుకోవడం లేదు . అమ్మాయి రంగు తెల్లగా ఉంటేనే పెళ్లి చేసుకుంటానని పట్టు బట్టాడు. అదే బస్తీలో ఉండే యువకుల పెళ్లిళ్లు అయి పిల్లా పాపలతో ఎంజాయ్ చేస్తుంటే సిరాజ్ పెళ్లి మాత్రం జరగడం లేదు. సిరాజ్ తండ్రి దుబాయ్ లో డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. సిరాజ్ తల్లి కోరిక మేరకు తండ్రి జాఫర్ దుబాయ్ నుండి హుటాహుటిన హైదరాబాద్ లోని చార్మినార్ కు వచ్చేశాడు. సిరాజ్ పెళ్లి కోసం తల్లిదండ్రులు సంబంధాలు  వెతుకుతున్నారు. చామన చాయలో ఉండే సిరాజ్  గొంతెమ్మ కోరికలే కోరుతున్నాడు.బాలివుడ్ నటి ఆలియాభట్ కు సిరాజ్ బిగ్ ప్యాన్.పెళ్లంటూ చేసుకుంటే ఆలియాభట్ మాదిరిగానే ఉండాలని కలలు కనేవాడు.  తెల్లగా ఉండే ఆలియాభట్ మాదిరిగానే ఉండాలని తల్లిదండ్రులకు కండిషన్ పెట్టాడు . ముదురు బెండకాయ కూరకు  ఎలా పనికి రాదో  సిరాజ్ పరిస్థితి అదే మాదిరిగా తయారయ్యింది.   తల్లి దండ్రులు బెజారెత్తి పోయారు. పరిష్కారం కోసం అదే బస్తీలోని మౌలానా దగ్గరికి వచ్చారు.  మౌలానా ఇంటి ముందు ఉన్న చబుత్రా మీద కూర్చుంటారు. చబుత్రా ఎందరికో కౌన్సిలింగ్ వేదిక మాదిరిగా ఉపయోగపడేది. గ్రామాల్లో రచ్చబండ మాదిరిగానే హైద్రాబాద్ లోని చబుత్రాలు కౌన్సిలింగ్ సెంటర్లుగా ఉపయోగపడుతుంటాయి. సిరాజ్ కేసు మౌలానా చబుత్రమీదకు వచ్చింది. శుక్రవారం కావడంతో నమాజ్ చేయడానికి  మౌలానా మసీదుకు వెళుతుండే సమయంలో జాఫర్ తారసపడతాడు. చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన జాఫర్ ను చూసి మౌలానా చిరుమందహాసంతో పలకరించాడు. 

జాఫర్: సలాం వాలేకుం మౌలానా సాబ్ 

మౌలానా: వాలేకుం సలాం, కైరియత్ 

జాఫర్: అలమ్ దులిల్లా ...మౌలానా మేరా బేటా  బుజుర్ గోకి బాత్ నై సున్ రే , షాదీ కర్నేకే లియే హమారేకో బేజార్ కర్రాబచ్చీకో పసంద్ నై కర్రా కుచ్ న కుచ్ రాస్తా బతావో

మౌలానా: ఇను సవ్లా ఇన్ కీ బీవీ గోరి హోనా కతే ..  జిస్ కు బీ కాయిష్ హై  గోరీ బచ్చీ హోనా ఉనే  అమెరికా కు జాకే షాదీ కర్నా.  హైద్రాబాద్మే బచ్చీయోకో డూండో మత్ . గోరీ బచ్చీ కే చక్కర్ మే బచ్చీ యోమే ఇల్జామ్ మత్ లగావ్.   కిసీ కీ బేటీ ఉస్ కే బాప్ కే ఘర్ మే పైదా  ఉహీ  ఉస్ కా రంగ్ రూప్ దేనేవాలా కుదా హై . మిల్లత్ కే బేటీ యోం కా తమాషా బనాయా జారా నవ్  జవానో మత్ కరో యైసా ....మస్లే కో సమ్జో నవ్ జవానో... ఔరేక్ గమ్మత్ కీ బాత్ యే హై వో గోరీ బచ్చీ డూడ్ నే  కోన్ జారీ  కాలీ బాజీ జారీ, కాలీ ఆపా జారీ తుమ్ లోగో బోల్ రే హమారీ ఘర్ కీ బాత్ మౌలానాకో కైసా మాలూమ్ ......   దేఖ్ సిరాజ్ అల్ బత్తా తుమ్ సవ్లే   సవ్లీ బచ్చీ  కో పసంద్ కరో... మస్లే కో సమ్జో నవ్ జవానో. 


బదనపల్లి శ్రీనివాసాచారి

Online Jyotish
Tone Academy
KidsOne Telugu