ప్రపంచంలోనే సత్యనాదెళ్ల టాప్

 

టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మరోసారి తన ప్రాముఖ్యతను చాటుకున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ జీతాలు అందుకుంటున్న వారిలో మొదటిస్థానాన్ని సాధించి రికార్డును సృష్టించారు. అంతర్జాతీయంగా 100 కంపెనీల్లో సీఈఓలు అందుకుంటున్న వేతనాలపై ఓ నివేదిక విడుదలైంది. ఈ నివేదికలో ఎక్కువ వేతనం అందుకుంటున్న వారిలో మన తెలుగువాడు సత్య నాదెళ్లకు మెుదటిస్థానం దక్కడం విశేషం. ఇతని జీతం 84.3 మిలియన్ డాలర్లు. మన ఇండియన్ కరెన్సీలో అయితే రూ.525 కోట్లు. గత ఏడాది మొదటిస్థానంలో నిలిచిన ఒరాకిల్ చీఫ్ లారీ ఎల్లిసన్, ఈ సంవత్సరం రెండో స్థానంలో ఉన్నారు. పెప్సికో సీఈఓ ఇంద్రా నూయికి 19.08 మిలియన్ డాలర్లతో 19 వ స్థానంలో ఉన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu