TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

టెక్కీలకు ఉద్యోగ గండం ఏఐ: పది వేల మందికి ఉద్వాసనకు సిద్ధమౌతున్న జర్మనీ దిగ్గజ టెక్ సంస్థ.!

Published on: Fri Nov 27, 2026 11:15AM

ఏఐ తో టెక్కీల ఉద్యోగాలపై కత్తి వేళాడుతున్న పరిస్థితి ఏర్పడింది. ప్రముఖ టెక్ సంస్థలు తమ తమ సంస్థల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఆ కోవలోకి జర్మనీకి చెందిన దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ ఎస్ఏపీ దాదాపు పది వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి సిద్ధమైంది. ఈ మేరకు ఎస్ఏపీ ఉద్యోగుల ఉద్వాసన ప్రతిపాదనను సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు  బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. 

కంపెనీ ప్రతిపాదిస్తున్న పదివేల మంది ఉద్యోగుల ఉద్వాసన సంక్య సంస్థ మెత్తం మేన్ పవన్ లో 9 శాతానికి సమానమని అచనా.  ఆ సంస్థ సీఈవో క్రిస్టియన్ క్లైన్ నాయకత్వంలో కంపెనీ తన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లలో ఏఐ సాంకేతికతను   అనుసంధానించే దిశగా అడుగులు వేస్తోంది. ఏఐ ఆధారిత పరిష్కారాలకు పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాపార మోడల్ మార్చుకోవడం, అదే సమయంలో నిర్వహణ ఖర్చులను అదుపులో ఉంచడం ఈ  ఉద్యోగుల ఉద్వాసన ప్రతిపాదనకు కారణంగా చెబుతున్నారు.ఈ క్రమంలో ప్రొడక్ట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాలలో ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందంటున్నారు.   ఏఐ రంగానికి అవసరమైన పెట్టుబడులు, నిధులను మళ్లించేందుకు ఎస్ఏపీ ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. జూలై నుంచే ఏఐ సంబంధిత బాధ్యతలు మినహా ఇతర విభాగాల్లో కొత్త నియామకాలను నిలిపివేసింది.  మరోవైపు ఉన్నత స్థాయి నాయకత్వంలోనూ మార్పులు చోటుచేసుకుంటుండగా, ప్రొడక్ట్ హెడ్, సేల్స్ హెడ్ వంటి కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు సంస్థ నుంచి వైదొలుగుతుండటంతో సంస్థలో భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన తప్పదన్న చర్చ గట్టిగా జరుగుతోంది.

ఇది కూడా చదవండి:  వోక్స్ వ్యాగన్ లో ఉద్యోగుల తొలగింపు.. ఎంత మందినో తెలుసా?

 గడిచిన మూడేళ్ల కాలంలో ఎస్ఏపీ చేపడుతున్న రెండో పెద్ద  ఉద్వాసన ఇదే కానుంది. గతంలో 2024 జనవరిలో ప్రకటించిన తొలగింపుల ద్వారా   9,000 నుంచి 10,000 ఉద్యోగాలను సంస్థ తగ్గించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.10 లక్షల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎస్ఏపీ, సాధారణంగా వార్షిక ఫలితాల నేపథ్యంలో జనవరి చివరిలో ఈ ఉద్వాసన ప్రకటనను అధికారికంగా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.    సాంకేతిక రంగంలో ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో వ్యాపార సంస్థలు తమ వనరులు, సిబ్బంది నిర్మాణాన్ని పునఃసమీక్షించుకుంటున్న సంగతి విదితమే.

  

ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ విభాగంలో ఏఐ ఆధారిత ఫీచర్లకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో, సంస్థలు తమ బడ్జెట్లను ఆ దిశగా మళ్ళిస్తున్నాయి.    ఖర్చుల నియంత్రణ, సాంకేతిక ఆధునీకరణ మధ్య సమతుల్యత సాధించేందుకు సంస్థలు ఉద్యోగుల సంఖ్య తగ్గింపుపై దృష్టి సారిస్తున్నాయి.  ఎస్ఏపీ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది.  త్వరలోనే ఈ పునర్‌వ్యవస్థీకరణ, ఉద్యోగాల కోతకు సంబంధించి కంపెనీ తరఫున అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. 

 

జనవరి నాటి వార్షిక ఫలితాల సమయంలో లేదా అంతకుముందే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్నున్నారు.    రాబోయే రోజుల్లో ఎస్ఏపీ ఏఐ వ్యూహం ఏ విధంగా అమలవుతుంది, వివిధ విభాగాలపై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై ఉద్యోగులు, మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. 

మీకు నచ్చవచ్చు:  వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్: ఉద్యోగుల తొలగింపునకు మైక్రో సాఫ్ట్ సరికొత్త వ్యూహం.!

ఉద్యోగులకు యాపిల్ ఉద్వాసనలు.. రెండు నెలల్లో రెండో సారి.!

[SAP employees,  layoffs,  AI,  SAP, Christian Klein,  SAPs restructuring, TeluguOne]