ఉద్యోగులకు యాపిల్ ఉద్వాసనలు.. రెండు నెలల్లో రెండో సారి.!
Published on: Mon Sep 21, 2026 11:13AM

టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ మరోమారు ఉద్యోగుల కోతలో కొత్త పుంతలు తొక్కుతోంది. రెండు నెలల వ్యవధిలో యాపిల్ తన సంస్థ నుంచి రెండు సార్లు పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, సంస్థాగత మార్పుల నేపథ్యంలో ఈ రిట్రెంచ్ మెంట్ ర్యాలీకి యాపిల్ శ్రీకారం చుట్టినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణే లక్ష్యంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న సంగతి తెలిసిందే. ఆ జాబితాలోకి ఆపిల్ కూడా చేరింది. తాజా పరిణామాల ప్రకారం.. ఆపిల్ సంస్థకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ ప్లస్ సేవ విభాగంలో ఉద్యోగులను తొలగించింది. ముఖ్యంగా ఈ సేవలకు సంబంధించిన ఆడియో ప్రొడక్షన్ విభాగాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై ఉద్వాసన వేటు వేసింది . ఆపిల్ వాచ్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన టైమ్ టూ వాక్, టైమ్ టూ రన్వంటి ప్రత్యేక ఆడియో ఫీచర్లపై పని చేస్తున్న కొందరిని విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సేవలను పూర్తిగా నిలిపివేయడం లేదనీ.. కేవలం కొత్త ఆడియో కంటెంట్ విడుదల వేగాన్ని తగ్గించే యోచనలో ఆపిల్ యాజమాన్యం ఉందని తెలుస్తోంది. ఆపిల్ వాచ్ యూజర్లకు గైడెడ్ వర్కౌట్ కంటెంట్‌ను అందించడంలో ఈ సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఫిట్‌నెస్ సర్వీస్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇతర పోటీ సంస్థల సేవలతో పోలిస్తే దీని నిర్వహణ వ్యయం భారీగా ఉండటంతో, వ్యయ నియంత్రణే లక్ష్యంగా యాపిల్ ఈ ఉద్యోగాల కోత చేపట్టిందని అంటున్నారు.
.webp)
రెండు నెలల కిందటే.. ఆపిల్ సంస్థ సిరి, విజన్ ప్రో , ఏఐ సంబంధిత సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ విభాగాల నుంచి 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సంస్థ తన ప్రాధాన్యతలను మార్చుకుంటోందని, వినియోగదారులకు మరింత మెరుగైన అనుభూతిని పంచేందుకు తగినట్లుగా అంతర్గత బృందాలను నర్వ్యవస్థీకరిస్తున్నామని పేర్కొంది. మళ్లీ ఇప్పుడు మళ్లీ ఫిట్‌నెస్ విభాగంలో ఉద్యోగులకు ఉద్వాసన పలకడం టెక్ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది.
[Apple Layoffs, Apple Fitness Plus, Tech News Telugu, Apple Job Cuts, Telugu One]


