బ్రిటీష్ ఎయిర్ వేస్ పై సచిన ఆగ్రహం.. సచిన్ ఎవరు?

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ అంటే తెలియని వారుండరు. జాతీయంగానే కాదు.. అంతర్జాతీయంగా కూడా ఎంతో పేరు సంపాదించుకున్న క్రికెట్ దేవుడు సచిన్. అలాంటి సచిన్ ను బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది సచిన్ అంటే ఎవరూ అని ప్రశ్నించారట. అంతేకాదు బ్రిటీష్ ఎయిర్ వేస్ లో సచిన్ కు అవమానం జరిగింది. దీనికి సంబంధించి సచిన్ స్వయంగా తన ట్విట్టర్ లో కోపంతో ట్వీట్ లు కూడా ట్వీటాడు.

ప్రస్తుతం ఆల్ స్టార్ క్రికెట్ టోర్నీ కోసం సచిన్ టెండుల్కర్ అమెరికాలో ఉన్నారు. అయితే తన కుటుంబ సభ్యులకు సీట్లు కేటాయించడంలో బ్రిటిష్ ఎయిర్ వేస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. అంతేకాదు తమ లగేజీ తాము సూచించిన ప్లేస్ కి కాకుండా వేరే ప్లేస్ కి తీసుకెళ్లారని.. దీనికి సంబంధించి ఎయిర్ వేస్ సిబ్బందిని అడిగేసరికి అసలు సచిన్ ఎవరని ప్రశ్నించారని.. ఆసమయంలో  ఆగ్రహం - అసంతృప్తి - ఒత్తిడికి లోనయ్యానని ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనికి బ్రిటిష్ ఎయిర్ వేస్ కూడా వేగంగానే స్పందించి.. లగేజీ వివరాలు పూర్తి అడ్రెస్ ఇస్తే అక్కడికే చేరుస్తామని సచిన్ ను క్షమాపణలు కోరింది.

మరోవైపు సచిన్ చేసిన ట్విట్టర్ పోస్ట్ లకి అభిమానులు బ్రిటిష్ ఎయిర్ వేస్ పై కామెంట్లు విసరడం మొదలుపెట్టారు. సచిన్ అంటే ఎవరు.. అని అడిగిన ప్రశ్నకు ధీటుగా సచిన్ పూర్తి పేరు తెలియదా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.  మాకు ఒబామా - మోడీ తెలుసునని అలాగే క్రికెట్ దేవుడు సచిన్ అంతకంటే ఎక్కువ తెలుసునని కొందరు ట్వీట్లు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu