జగన్ కు సబ్బంహరి హెచ్చరిక

 

 

 

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ సబ్బంహరి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. నిజమైన సమైక్య వాదులు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గెరపెట్టుకోవాలని హెచ్చరించారు. జగన్ తన స్వార్ధ రాజకీయాలకోసం సమైక్యవాదులను దొంగలనడం సరికాదన్నారు. ''వాళ్ళు దొంగలు...వీళ్ళు దొంగాలంటే'' ఊరుకొనేదిలేదన్నారు.


ప్లీనరీలో ఆయన బాష స్థాయికి తగ్గట్టులేదన్నారు. సిగ్గు గురించి జగన్ మాట్లాడితే సిగ్గుకే సిగ్గేస్తు౦దన్నారు. జగన్ పార్టీలో ఎవరికి ఎంత గౌరవం ఉంటుందో ఆయన సోదరి షర్మిలాకు బాగా తెలుసునని అన్నారు. వైకాపా నేతలకు వున్న సంస్కారాలు తనకు అంటగట్టవద్దని కోరారు. ఇకపైన వైకాపా నేతలు తన గురించి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. జగన్ బయట సమైక్యవాది..లోపల విభజనవాది అని ఆరోపించారు.  పార్లమెంట్లో తొంభై శాతం బిల్లులు మూజువాణి ఓటుతోనె ఆమోదం పొందుతాయని తెలిపారు.  
                                   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu