ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ... రన్ రాజా రన్

 

తారాగణం: శర్వానంద్, సీరత్ కపూర్, సంపత్, జయప్రకాష్ అడివి శేషు, విద్యుల్లేఖ రామన్, కోట శ్రీనివాసరావు, సంగీతం: జిబ్రాన్, కెమెరా: మది, నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి, దర్శకత్వం: సుజిత్. ‘రన్ రాజా రన్’ సినిమా శుక్రవారం విడుదలైంది.

 

ఇది ఒక యూత్ ఫుల్ సినిమా. కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో వినోదాత్మకంగా వుండే సినిమా ఇది. కథ విషయానికి వస్తే, ఒక ముఠా సమాజంలో ప్రముఖుల మాస్క్‌లని ముఖాలకు పెట్టకుని కిడ్నాప్‌లు చేస్తూ వుంటుంది. ఈ ముఠాని పట్టుకునే బాద్యతని దిలీప్ (సంపత్‌రాజ్) అనే పోలీస్ ఆఫీసర్‌కి అప్పగిస్తారు. ఇదిలా వుంటే, చాలామంది అమ్మాయితో లవ్ ఫెయిలైపోయి ప్రేమంటేనే విసుగుపుట్టిన దశలో వున్న రాజా హరిశ్చంద్రప్రసాద్ (శర్వానంద్)తో పోలీసు ఆఫీసర్ కూతురు ప్రియ (సీరత్ కపూర్) ప్రేమలో పడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. వీరి ప్రేమ తనకు నచ్చకపోయినా పోలీస్ ఆఫీసర్ నచ్చినట్టు నటిస్తూ వుంటాడు. తన కూతుర్ని రాజా నుంచి దూరం చేయడానికి ఒక కిడ్నాప్ డ్రామా ప్లాన్ చేస్తాడు.. ఇక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరిగి వినోదాన్ని పంచుతుంది.

 

హీరో శర్వానంద్ చాలా చలాకీగా నటించాడు. అతనిలోని నటుడు డెవలప్ అయ్యాడు. సీరత్ కపూర్ అందగత్తె మాత్రమే కాదు.. అభినయం కూడా తెలిసిన హీరోయిన్. సీరత్ కపూర్ తన అందంతో కుర్రాళ్ళని కట్టిపారేస్తుంది. మది మంచి కెమెరా పనితనం చూపించాడు.

 

కిడ్నాప్ కథ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాని ఓ అందమైన ప్రేమ కథగా రూపొందించడంలో దర్శకుడు సుజీత్ విజయం సాధించాడు. తెలుగు, తమిళ, హిందీ హీరోలు, రాజకీయ నాయకులు, క్రికెటర్ల మాస్క్ లతో వెరైటీగా కిడ్నాప్ ముఠాను దర్శకుడు వెరైటీగా డిజైన్ చేసిన తీరు బాగుంది. సినిమా నిర్మాణ విలువులు బాగున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu