అన్నాఅంటే ఏమిటో అందరికీ తెలుసు : హజారే

హైదరాబాద్: ఆర్ఎస్ఎస్‌తో అన్నా హజారేకు సంబంధం ఉన్నట్టు మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై హజారే స్పందిస్తూ  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో తమకెలాంటి సంబంధాలు లేవని అయన స్పష్టం చేశారు.ఆర్‌ఎస్‌ఎస్‌తో మాకు ఎలాంటి సంబంధాలు లేవు అని తన స్వగ్రామమైన రాలేగావ్‌సిద్ధిలో మీడియాతో అన్నారు.ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ చేసిన వ్యాఖ్యలను హజారే తప్పుబట్టారు.  అన్నా అంటే ఏమిటో అందరికీ తెలుసుఅన్నారు . అవినీతిపై పోరాడాలంటే ఎన్నికల్లో పోటీ చేయడం ఒక్కటే సరిపోదని, బయటి వ్యక్తులు కూడా పోరాటం చేయొచ్చని హజారే అన్నారు. అవినీతిపై పోరాటం చేసేవారు దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి, పోరాడాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇటీవల అన్నా బృందంపై విరుచుకుపడ్డారు. దీన్ని ఖండిస్తూ అన్నా పైవిధంగా వ్యాఖ్యానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu