ధ్వ‌జ‌స్తంభం తాకాడ‌ని రూ.60వేల జ‌రిమానా!

పండ‌గ‌రోజు, ఏద‌యినా ప్ర‌త్యేక‌మైన రోజు గుడికి వెళుతూంటారు. కుటుంబ‌స‌మేతంగా వెళ్లి దేవుడి ద‌ర్శ నం చేసుకుని రావ‌డం ఆన‌ వాయితీ. ఇది ప్ర‌తీ ప్రాంతం లోనూ సాధార‌ ణంగా క‌ని పించే దృశ్య‌ మే. అయితే అలా కుటుంబ‌స‌మేతంగా వెళ్లిన‌పుడు పిల్ల‌ల్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌న్న ఆలోచ‌న ఉండ‌క‌పోవ‌చ్చు. వ‌చ్చింది గుడికి కాబ‌ట్టి దేవుడి మీదే దృష్టి ఉంటుంది. పిల్ల‌లు ఆడుతూ పాడుతూ కాస్తంత అవ‌త‌లికీ, ఇవ‌త‌ల‌కీ వ‌చ్చి ధ్వ‌జ‌స్తంభం చుట్టూ తిరుగుతూ ఆడుతుంటారు, లేదా గుడి ఆవ‌ర‌ణ‌లో విగ్ర‌ హాలు తాకుతూ ఆడుతూంటారు. వారిని ఎవ్వ‌రూ ప‌నిగ‌ట్టుకుని త‌ప్పు ప‌ట్ట‌రు.. పిల్ల‌లు గ‌నుక‌. కానీ క‌ర్ణాట‌క కోలార్ జిల్లాలో ఒక ద‌ళిత కుటుంబానికి మాత్రం భారీ జ‌రిమానా ప‌డింది. 

మ‌ల్హూర్ జిల్లా ఉల్లెర‌హ‌ళ్లి గ్రామంలో గ‌త‌వారం ఒక ద‌ళిత కుటుంబం గ్రామంబ‌య‌ట ఉన్న ఒక గుడికి వెళ్లారు. అక్క‌డి సిద్ధిరా న్న ద‌క్షిణాదిన గ్రామాల‌లో ప్ర‌జ‌లు ఎంతో న‌మ్మే దేవ‌త గుడి. గ‌త‌వారం అక్క‌డ భూత‌య‌మ్మ సంత జ‌రిగింది. ఈ దేవ‌తను ద‌ర్శించుకోవ‌డానికి పెద్దసంఖ్య‌లో ద‌ళితులూ వెళ్లారు. కానీ దేవాల‌య అధికారులు వారిని లోప‌లికి వెళ్ల‌కుండా అడ్డుకున్నారు. శోభ‌మ్మ‌, ర‌మేష్ల కుమారుడు 12ఏళ్ల కుర్రాడు గుడి ఆవ‌ర‌ణ‌లో అంద‌రితోపాటు వ‌స్తున్నాడు. గుడి ఆవ‌ర‌ణ‌ లో ఒక పెద్ద ధ్వ‌జ‌ స్తంభం ఉంది. జ‌నంలో వ‌స్తూ ఆ పిల్ల‌వాడు దాని స‌మీపంలోకి రాగానే దాన్ని ప‌ట్టుకుని ఆడాడు. అంతే కాదు, లోప‌లికి వెల్లిన త‌ర్వాత దేవ‌త విగ్రహాన్ని కూడా తాకాడ‌ని అక్క‌డివారు కోప‌గించుకుని తిట్టారు. 

ఈ కంప్యూట‌ర్ యుగంలోనూ ఇటువంటి అర్ధంలేని నిబంధ‌న‌లు ఉండ‌టం, అమ‌లు చేయ‌డ‌మే దారుణం. పిల్ల‌వాడు చేస్తున్న‌ది ఒక గ్రామ‌స్తుడు చూసి అక్క‌డి అధికారుల‌కు చెప్పేడు. అంతే ప్ర‌పంచం ముని గిపోయిన‌ట్టు నానా యాగీ చేశాడా పెద్ద‌మ‌నిషి. ఆ కుటుంబాన్ని బ‌య‌టికి పంపించ‌డంతో  ర‌భ‌స ముగిసిం ద‌నుకున్నారంతా. కానీ వారిని గుడి ఆవ‌ర‌ణ నుంచి బ‌య‌టికి రాగానే పంచాయితీ పెట్టి కుటుంబంపై రూ.60 వేలు జ‌రిమానా విధించారు. అదీ అక్టోబ‌ర్ ఒక‌టో తేదీనాటికి క‌ట్టేయా ల‌న్నారు. ఒక‌వేళ క‌ట్ట‌ని ప‌క్షం లో ఆ కుటుంబం గ్రామం నుంచి బ‌య‌టికి వెళ్ల‌వ‌ల‌సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. 

ఉల్లెర‌హ‌ళ్లి గ్రామంలో సుమారు 75 ద‌ళిత కుటుంబాలున్నాయి. వారంతా ఒక్క‌లింగ తెగ‌కు చెందిన‌వారు. ఈ తెగ‌కు సంబం ధించి ప‌ది కుటుంబాలున్నాయి. వాటిలో శోభ‌మ్మ కుటుంబం ఒక‌టి. వీరు  గ్రామ వెలుప‌లే ఉంటున్నారు. వీరి పిల్ల‌ వాడు ప‌క్క‌నే ఉన్న టెక్క‌ల్ గ్రామంలో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. శోభ‌మ్మ భ‌ర్త ర‌మేష్ అనారోగ్యంతో బాధ‌ప‌డు తున్నాడు. శోభ‌మ్మ బెంగుళూరు వైట్‌ఫీల్డ్‌లో ఒక అపార్ట్‌మెం టులో ప‌నిచేస్తూ నెల‌కు రూ.13వేలు సంపాదిస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో వారు జ‌రిమానా రూ.60వేలు ఎలా చెల్లిస్తార‌ని ఆ గ్రామంలోని ద‌ళితులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

ఇదిలాఉండ‌గా, ఈ జ‌రిమానా విధించిన గ్రామ‌పంచాయితీ స‌భ్యుడు నారాయ‌ణ‌స్వామి, గ్రామ‌ప్ర‌ధాన్ వెంక‌ట‌ప్ప‌ల మీద హ‌క్కుల సంఘం నేత‌లపై  పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu