త్వరలో 2,000 నోట్ల రద్దు...బ్యాంకులకు వర్తమానం...అలెర్ట్ అయిన రాష్ట్రాలు!!

త్వరలో రెండువేల రూపాయల నోట్ల రద్దు...ఈ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని జాతీయ బ్యాంకులు తమ శాఖలకు ఈ మేరకు వర్తమానం పంపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్లను స్వీకరించటం వరకూ మాత్రమే చేయాలనీ, వాటిని తిరిగి సర్క్యులేట్ చేయవద్దని జాతీయ బ్యాంకుల హెడ్ క్వార్ట్రర్స్ సందేశం అందినట్టు కొందరు బ్యాంకుల అధికారులు అంగీకరిస్తున్నారు. డీ మోనిటైజేషన్ తర్వాత కేంద్రం తీసుకోబోతున్న ఈ సంచలన నిర్ణయం వెనుక , బిజెపి  విస్తృత రాజకీయ ప్రయోజనాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

వాస్తవానికి అప్పటికే  చలామణీలో ఉన్న 500, 1000 నోట్లను రద్దుచేస్తున్నట్లు 2016 నవంబరులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్రకటిత ఆస్తులు, నల్లధనాన్ని అరికట్టడానికి అదే సరైన పద్ధతని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, నగదు వాడకాన్ని తగ్గించి, డిజిటల్ లావాదేవీల వైపు అడుగులు వేయడానికి కూడా ఇది తోడ్పడుతుందని చెప్పింది. అయితే ఈ చర్యతో మిశ్రమ ఫలితాలు లభించాయి. దీనివల్ల పన్నుల వసూళ్లలో గణనీయమైన వృద్ధి సాధించినప్పటికీ, అక్రమాస్తులను బయటకు తీయడానికి ఈ నోట్ల రద్దు ఎంతవరకూ ఉపయోగపడిందనే దానిపై ఇప్పటికీ సరైన సమాచారం లేదు. అలాగే, డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నా నగదు వాడకం కూడా ఏమీ తగ్గలేదు. ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న సంక్షోభాల నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికే ఈ కొత్త ఎత్తుగడకు కేంద్రం వ్యూహం పన్నినట్టు విపక్షాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu