హమ్మ రోజా.. నువ్వూ మార్గదర్శిలో చేరావా?

ఏపీకి మాజీ కాబోతున్న ముఖ్యమంత్రి జగన్ ఆమధ్య మార్గదర్శి సంస్థ మీద పగబట్టి, ఏదో ఒక సంబంధం లేని దిక్కుమాలిన కేసు పెట్టించి సంస్థ అధినేత రామోజీరావు తదితరుల మీద విచారణ ప్రారంభించారు. అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న రామోజీరావును వేధించారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడంతో జగన్ అండ్‌ కో శాంతించక తప్పలేదు. ఆవు చేలో మేస్తే దూడ మాత్రం గట్టున మేస్తుందా అన్నట్టు.. జగన్ ఆశయాలకు అనుగుణంగా అప్పట్లో వైసీపీ నాయకులు రామోజీరావు మీద, మార్గదర్శి సంస్థ మీద నిప్పులు చెరిగారు. 
‘‘నేనూ మార్గదర్శలో చేరాను.. ఒక మోపెడ్ కొనుక్కున్నాను’ అనే యాడ్ అందరికీ గుర్తుండే వుంటుంది. ఇప్పుడు లేటెస్ట్.గా ఆ ప్రకటన షూట్ చేయాలంటే రోజాని మించిన యాక్టర్ మరొకరు వుండరు. ఎందుకంటే, రోజా కూడా మార్గదర్శిలో చేరారు. శుక్రవారం నాడు కదిరి స్థానానికి నామినేషన్ సమర్పించిన సందర్భంగా ఆమెకి సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడయ్యాయి. వీటిలో చెప్పుకోవల్సింది ఏంటంటే, రోజా మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థలో సభ్యురాలు. 2020లో ఆమె 40 లక్షల రూపాయల చిట్‌లో చేరారు. 2020 ప్రాంతం అంటే, వైసీపీ నాయకులు మార్గదర్శి మీద పగబట్టి వేధింపులు జరుపుతున్న సమయం. ఒకవైపు జగనన్న మార్గదర్శి మోసకారి సంస్థ అని శాయశక్తులా దుష్ప్రచారం చేస్తుంటే, జగనన్న బాటలో నడిచే రోజా మాత్రం మార్గదర్శి చిట్‌ఫండ్‌లో చేరడం మాత్రం నిజంగానే ఒక వింత. మరి రోజా మార్గదర్శిలో చేరారన్న విషయం తెలిస్తే జగనన్న ఎలా ఫీలవుతారో ఏంటో. రోజా మార్గదర్శిలో చేరిన అంశాన్ని రాజకీయాలు రాజకీయాలే, వ్యక్తిగతం వ్యక్తిగతమే అన్నట్టుగా చూడాలా.. లేక.. అవసరమైతే కస్టమర్ హోదాలో మార్గదర్శి మీద విరుచుకుపడటానికి అలా గ్రౌండ్ ప్రిపరేషన్ ఏమైనా చేసి వుంటారా అన్నట్టు చూడాలా?