రాణించిన రోహిత్‌, కోహ్లీ...భారత్ ఘన విజయం

 

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల టార్గెట్‌ను ఒకే వికెట్ కోల్పోయి టీమిండియ ఘన విజయం సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో చెలరేగగా , విరాట్ కోహ్లీ 74 పరుగుల అద్బుత ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయింది.

 భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆసీస్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. రెన్‌షా (56) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో యువ పేసర్ హర్షిత్ రాణా 4 వికెట్లతో సత్తా చాటగా, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టిమీండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (24) త్వరగానే ఔటైనా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu