ఒంగోలు పోలీసుల విచారణలో ఆర్జీవీ 

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను (ఆర్జీవి)  ఎపి పోలీసులు విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో ఆయన ఒంగోలు పోలీసుల ఎదుట హాజరయ్యారు.  ఎపిలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు వర్మ వ్యూహం చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆర్జీవీ అప్పట్లో ప్రతిపక్షనేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , మంత్రి లోకేశ్ లను కించపరిచే  పోస్టులు పెట్టారు. ఈ  కేసులో పోలీసుల కళ్లు గప్పి ఆయన తప్పించుకుంటున్నారు. ఒంగోలు పోలీసులు పలుమార్లు నోటీసులిచ్చినప్పటికీ వర్మ హాజరు కాలేదు. ఒంగోలు పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి  హైద్రాబాద్ నివాసానికి వచ్చినప్పటికీ పరారయ్యారు. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయకూడదని వర్మ తెలంగాణ హైకోర్టులోక్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని వర్మ కోర్టును అభ్యర్థించారు. కోర్టు తీర్పు ప్రకారం వర్మకు  ఈ కేసులో బెయిల్ వచ్చింది.  పోలీసుల విచారణకు  సహకరించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఒంగోలు పోలీసులు మరో మారు నోటీసులిచ్చారు. నోటీసుల ప్రకారం  శుక్రవారం వర్మ  పోలీసుల విచారణకు హాజరయ్యారు.  పోలీసుల ప్రశ్నలకు వర్మ డొంకతిరుగుడు సమాధానాలు ఇస్తున్నారని సమాచారం. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu