రేవంత్ పట్టుకుపోతున్న డేటా ఇదే...

 

అందరి ఊహాగానాలను నిజం చేస్తూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. అంతే కాదు పార్టీ మారకముందు తన వెంట నడిచే వాళ్లు తనతోనే ఉన్నారని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడో అలానే జరిగింది. రేవంత్ రెడ్డి టీడీపీ కి గుడ్ బై చెప్పగానే... రేవంత్ వెంటే చాలామంది నేతలు క్యూ కట్టారు. దీంతో టీటీడీపీ చాలా వరకూ ఖాళీ అయినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది టీడీపీ నుండి జంప్ అయ్యారు. ఇంకా చాలా మంది రేవంత్ వెంట నడవనున్నారు. ఇక టీడీపీకి రాజీనామా చేసిన పార్టీల జిల్లా అధ్యక్షుల్లో సుభాష్‌రెడ్డి (కామారెడ్డి), బోడ జనార్దన్‌ (మంచిర్యాల), తోటకూర జంగయ్య యాదవ్‌ (మేడ్చల్‌), కేతావత్‌ బిల్యా నాయక్‌ (నల్లగొండ), పటేల్‌ రమేష్ రెడ్డి (సూర్యాపేట), సీహెచ్‌ విజయ రమణరావు (పెద్దపల్లి), సోయం బాపూరావు (ఆదిలాబాద్‌)లు ఉన్నారు. వీరితో పాటు వరంగల్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్యలు ఇప్పటికే రేవంత్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి రాజారాం యాదవ్‌, ఖలీంపతి, నీలకంఠరావు పాటిల్‌, నారాయణ, జనార్దన్‌ రెడ్డి, పరవయ్య, ధనంజయ, ఏనుగు మోహన్‌ రెడ్డి, రేఖ, విజయలక్ష్మి, ఖమ్మం జిల్లా నుంచి కంభంపాటి చంద్రశేఖర్‌రావు, ప్రసాద్‌, బానోతు హరిప్రియ, బానోతు హరిసింగ్‌ నాయక్‌, దేవేందర్‌ నాయక్‌, ప్లెంట్‌ రోజ్‌, నల్గొండ జిల్లా నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. చివరి నిముషంలో వరంగల్ జిల్లా మహిళా నేత సీతక్క కూడా టిడిపికి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. మరి ఇంకా ఎంత మంది టీడీపీని విడతారో చూద్దాం..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu