నేడు కాంగ్రెస్ లోకి రేవంత్...

 

టీడీపీకి షాకిచ్చి.. ఆ పార్టీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్టు సమాచారం. దానికంటే ముందు ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు రాహుల్ గాంధీని కలుసుకునే రేవంత్, దాదాపు గంట సేపు ఆయనతోనే గడపనున్నారు.  తనవెంట పార్టీలోకి వస్తున్నవారిని రాహుల్‌కు రేవంత్‌ పరిచయం చేస్తారు. వీలైతే రేవంత్, సోనియా గాంధీని కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకుంటారని సమాచారం. రాహుల్ తోనే కలసి ఆయన మధ్యాహ్న భోజనం చేయనున్నారు. రేవంత్‌ వెంట వచ్చే వాళ్లు బస చేయడానికి కర్నాటక భవన్‌లో 30 గదులు బుక్‌ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 50మంది ఢిల్లీకి చేరుతున్నా రాహుల్‌ గాంధీ మాత్రం 15 మంది వరకు మాత్రమే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించేలా పార్టీ పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu