రేవంత్ ఓ బాహుబలి...


అన్నీ నాకే కావాలి అంటూ.. వివాదం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానంటూ... అందరి విషయాలు నాకే అనుకునే రాంగోపాల్ వర్మకు సినిమాలైన, రాజకీయాలైన.. నిజం చెప్పాలంటే అసలు విషయం ఏదైనా సరే నేనున్నానంటూ వేలు పెడుతుంటాడు. అలాంటి వర్మ గత కొద్దిరోజులుగా రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రేవంత్ రెడ్డి ఎపిసోడ్ గురించి ఇంకా మాట్లాడలేదేంటబ్బా అని అనుకున్నారు. కానీ అక్కడ ఉంది వర్మ కదా.. కాస్త లేట్ గా రెస్పాండ్ అయినా.. లేటెస్ట్ గా సెటైర్లు విసురుతాడు. అలాగే ఇన్ని రోజుల తరువాత రేవంత్ రెడ్డి విషయంపై స్పందించిన వర్మ.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ‌లో చేరడం త‌న‌కు చాలా చాలా హ్యాపీ అని అన్నాడు. అక్కడితో ఆగితే వర్మ ఎందుకు అవుతాడు...  రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ద్వారా తనకు ఆ పార్టీపై పూర్తి నమ్మకం ఏర్పడిందని... కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి అని, బాహుబలి బాక్సాఫీస్‌కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కి ఓట్ల వర్షం కురిపిస్తాడని కొనియాడాడు. అలాగే తన పోస్టులో బాహుబ‌లి గెట‌ప్‌లో రేవంత్ రెడ్డిని చూపించారు. "సాహోరే బాహుబ‌లి రేవంత్ రెడ్డి" అంటూ రేవంత్ బాహుబలి గెటప్‌లో వున్న ఫోటోను చూపించారు. మరి మొన్నిటి వరకూ ఎన్టీఆర్ బయోపిక్ నేపథ్యంలో వర్మపై టీడీపీ నేతలు చేసిన విమర్శలకు గాను మళ్లీ కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu