టీఆర్ఎస్ నిబంధనలను ఉల్లంఘిస్తోంది.. రేవంత్ రెడ్డి
posted on Nov 14, 2015 5:24PM

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు తమ ఛానెళ్లలో వార్తలను ప్రసారం చేస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తోందని.. ప్రచారంలో పరిమితికి మించి ఎక్కువ ఖర్చు చేస్తున్నారని.. టీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాదు టీన్యూస్, నమస్తేతెలంగాణ పత్రికల్లో తమ వార్తలు ప్రచురిస్తున్నారని.. వాటిని పెయిడ్‌న్యూస్‌గా పరిగణించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ విషయంపై ఎన్నికల ప్రధాన కార్యదర్శి భన్వర్ లాల్ ను టీ టీడీపీ, బీజేపీ నేతలు కలిశారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఉపఎన్నిక టీఆర్ఎస్ నేతలు ఎన్నికలు కోడ్ ను ఉల్లంఘించారు అంటూ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.