రేవంత్ రెడ్డి గోడ కూల్చేందుకు యత్నం
posted on Jul 15, 2015 12:21PM

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి చెందిన స్థలం ప్రహరీ గోడను కూల్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నేత అనుచరులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం గోపన్నపల్లిలో రేవంత్ రెడ్డికి చెందిన స్థలం ఉంది. దానికి ఉన్న ప్రహరీ గోడను కూల్చేందుకు శంకర్ గౌడ్ అనే టిఆర్ఎస్ నేత అనుచరులు ప్రయత్నించారని రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ అధికార ప్రభుత్వం రేవంత్ రెడ్డిపై ఉన్న కక్ష్య కారణంగానే ఇలాంటి పనులు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.