రేవంత్ రెడ్డి ఆగష్టు 3న హాజరుకావాలి.. ఏసీబీ కోర్టు

 

ఓటుకు కేసులో ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డికి ఈనెల 13వ వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఏసీబీ విధించిన రిమాండ్ ఈరోజుతో ముగియడంతో ఏసీబీ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. కానీ రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరుకాకపోడంతో ఆగష్టు 3న హాజరుకావల్సిందిగా కోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు కొన్ని షరతులు విధించిందని.. దానిలో భాగంగానే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఆర్డర్‌లో హైదరాబాద్‌కు రావద్దని ఆదేశాలు ఉండటం వల్లే కోర్టుకు రాలేకపోతున్నారని రేవంత్‌ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కానీ బెయిల్ ఉన్నప్పటికీ కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే అని న్యాయమూర్తి చెప్పడంతో.. ఆగష్టు 3న రేవంత్‌రెడ్డి కోర్టుకు హాజరవుతారని ఆయన తరపు న్యాయవాదులు చెప్పడంతో విచారణను వాయిదా వేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu