రేవంత్ కి బెయిల్ రాకుండా చేయాడానికి ఖర్చు 2కోట్లా?
posted on Jul 4, 2015 12:53PM
.jpg)
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పథకం ప్రకారం ఈ కేసులో ఇరికించారని అందరికీ అర్ధమయ్యే విషయమే. ఎంత తెలివిగా ఈ కేసులో ఇరికించాలని చూశారో అంతే జాగ్రత్తగా రేవంత్ కు బెయిల్ రాకుండా చేయడానికి కష్టపడ్డారు. ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన దగ్గరనుండి దాదాపు నెల రోజులు జైలులో ఉంచి.. నాలుగు రోజులు కస్టడీలో విచారణ జరిపిన తరువాత కూడా ఇంకా విచారణ జరపాలి.. అంటూ చెప్పి బెయిల్ రాకుండా చేశారు. కానీ రేవంత్ రెడ్డి తాను చెప్పాల్సిందంతా విచారణలోనే చెప్పానని చెప్పడానికి ఇంకా ఏం లేదని ఏసీబీ అధికారులు కావాలనే బెయిల్ రాకుండా చేస్తున్నారని తెలుసుకొని హైకోర్టు తలుపులు తట్టారు. హైకోర్టు ఏసీబీ అధికారులకు మొట్టికాయ వేస్తూ రేవంత్ కు బెయిల్ మంజూరు చేసింది. కానీ టీ ఏసీబీ అంతటితో ఆగిందా లేదు. ఏకంగా హైకోర్టు రేవంత్ బెయిల్ పై ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. పాపం అక్కడ కూడా ఏసీబీకి చుక్కెదురైంది. ఇప్పటికి వరకూ రేవంత్ రెడ్డిని జైల్లోనే ఉంచుకున్నారు కదా.. ఇంకా ఉంచుకొని ఏంచేస్తారు అని దిమ్మతిరిగి పోయే సమాధానం చెప్పింది. రేవంత్ బెయిల్ రద్దు చేసేది లేదు.. ఒకవేళ రేవంత్ ఏదైనా బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే అప్పుడు రండి అని సూచించింది.
ఇదంతా ఒక ఎత్తయితే రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా చేయడానికి టీ ప్రభుత్వం 2కోట్లు ఖర్చు చేసిందని ఇప్పుడు రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఒక వ్యక్తి మీద ఉన్న కక్ష్య కారణంగా ప్రజల సొమ్మును టీ ప్రభుత్వం ఇలా దుర్వినియోగం పరచడం నేరమని ఇప్పుడు రాజకీయ నాయకులు భావిస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా చేయాడానికి ఏసీబీ తరుపు న్యాయవాదులకు ఇంత ఖర్చు చేయడం అవసరమా అని అనుకుంటున్నారు ప్రజానీకం.. పోనీ ఇంతా చేసినా ఏసీబీకి ఒరిగింది ఏమైనా ఉందా అంటే అదీ లేదు.. ఎప్పటికైనా న్యాయమే గెలిచితీరుతుంది అన్నట్టు కొంచెం లేటయినా రేవంత్ రెడ్డికి బెయిల్ ఇచ్చి ఏసీబీకి చెంపదెబ్బకొట్టేట్టు చేశారు. ఏదేమైనా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాల్నిస ప్రభుత్వం రాజకీయ కక్ష్యల వల్ల ప్రజాధనాన్ని తమ స్వార్ధం కోసం ఉపయోగించడమనేది అనైతికం.