రేవంత్ వ్యాఖ్యలకు గవర్నర్ మనస్తాపం

రాజ్ భవన్ ను గాంధీ భవన్ గా మార్చారని తెలుగు దేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గవర్నర్ మనస్తాపం చెందారు. నరసింహన్ కాంగ్రెస్ అదినేత్రి సోనియా గాంధీ ప్రతినిధిగా మారారని కూడా అయన వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఇంతకు ముందెన్నడూ నరసింహన్ పై ఎవరూ చేయలేదు.

వివిధ పార్టీల రాజకీయ ప్రాధాన్యతలు ఎలా ఉన్నా, గవర్నర్ ఫై చేసిన ఈ వ్యాఖ్యలు సరైనవి కావు.

రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, పరిస్తితులను చక్కదిద్దేందుకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో రేవంత్ వ్యాఖ్యలు ఆహ్వానించ దగినవి కావు.

రాష్ట్రంలో అయోమయ పరిస్థితి నెలకొని ఉన్నా , తన వంతు పాత్రను నరసింహన్ సమర్ధవంతంగా నిర్వహిస్తున్నరనడంలో ఎలాంటి సందేహం లేదు.

అక్రమ మార్గంలో పయనించడానికి గవర్నర్ కు సొంత వ్యాపారలేమీ లేవు. అలాంటి వ్యక్తి ఫై వ్యాఖ్యలు చేసే ముందు ప్రజా ప్రతినిధులు ఓ సారి ఆలోచిస్తారని ఆశిద్దాం.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu