గుర్రపు పందాలు కాదు

 

"అతనొక్కడే", "కిక్", "ఊసరవెల్లి" వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి పుట్టినరోజు నేడు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "రేసుగుర్రం". ఈ సినిమా విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ... ఈ కథకు "రేసుగుర్రం" అనే టైటిల్ వందశాతం కరెక్ట్. అలాగని ఇది గుర్రపు పందాల నేపధ్యంలోసాగే కాదు. ఇందులో బన్నీ పాత్ర ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఒక్కసారి లక్ష్యాన్ని ఫిక్స్ అయితే ఇక తగ్గే సమస్యే ఉండని పాత్ర తనది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. రెండు పాటలు మినహా దాదాపుగా షూటింగ్ పూర్తయినట్టే. పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. విడుదల ఎప్పుడనేది నిర్మాతలు బుజ్జి, వెంకటేశ్వరరావులు చెబుతారు అని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu