విమానం కూలిపోవడానికి కారణం అదేనా?
posted on Jun 20, 2025 12:43PM

సాధారణంగా మనం బైక్ తీసుకుని బయలుదేరినప్పుడు ఒక్కోసారి పెట్రోల్ ట్యాంక్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోతుంటాం. అయినా బండి స్టార్ట్ అవుతుంది, ఓ ఫర్లాంగు దూరం నడుస్తుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. సరిగ్గా అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన క్షణాలలోనే కుప్పకూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం విషయంలో ఇలాంటిదే జరిగివుంటుందని కొందరు నిపుణులు విశ్లేసిస్తున్నారు.
1,26,000 లీటర్ల ఇంధనం విమానం ట్యాంకులో నింపిన తర్వాత ట్యాంకు నుండి ఇంజనుకు ఇంధనం వెళ్లే స్విచ్ ఆఫ్ చేస్తారట. విమానం బయలుదేరే ముందు దానిని ఆన్ చేయడం మర్చిపోయి ఉంటారని అంటున్నారు. పైపుల్లో ఉన్న ఇంధనం విమానం టేకాఫ్ అయి కొద్ది దూరం ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఇంధనంఅందక రెండు ఇంజన్లు ఆగిపోతాయి. ఎందుకంటే.. విమానం సక్రమంగా గాల్లోకి లేచిందంటే ఇంజన్లు బాగున్నట్టే. ఒకేసారి రెండు ఇంజన్లు ఫెయిల్ కావడం జరగదు.
ఇది కేవలం విశ్లేషణ కాదండోయ్. కొందరు నిపుణుల అంచనా. అయితే.. పెట్రోలు స్విచ్ ఆఫ్ లో ఉంటే పైలట్ కు ఇండికేటర్ సిగ్నల్ చూపించదా, అలాంటి టెక్నాలజీ ఏమీ ఉండదా అనేది సందేహం. విచారణ పూర్తయితేనే అసలు విషయం బయటకు వస్తుంది.