వంశీ.. జైలు నుంచి మళ్లీ ఆస్పత్రికి

వైసీపీ సీనియర్ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరో మారు ఆస్పత్రిపాలయ్యారు. గురువారం (జూన్ 19) రాత్రి ఆయన అస్వస్థతకు గురి కావడంతో విజయవాడ జిల్లా జైలు నుంచి జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  వివిధ కేసులతో 3 నెలల క్రితమే అరెస్టై రిమాండ్ ఖైదీగా  జైలులో  ఉన్న వల్లభనేని వంశీ.. జైలులో పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు.

దీంతో తరచుగా ఆయనను అధికారులు జైలు నుంచి ఆస్పత్రికి.. ఆస్పత్రి నుంచి జైలుకు అన్నట్లుగా తిప్పితున్నారు. కోర్టు   ఇటీవలే మ ఇటీవలే సమగ్ర వైద్య పరీక్షల కోసం ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. దీంతో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయను చికిత్స అందించి, ఆరోగ్యం కుదుటపడిన తరువాత తిరిగి జైలుకు తీసుకువచ్చారు.  తాజాగా గురువారం వంశీ   వాంతులు, విరేచనాలతో  డీహైడ్రేషన్ కు గురవ్వడంతో జైలు అధికారులు ఆయనను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.