ఐపీఎల్ విజేత ఆర్సీబీ

ఆర్సీబీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది.  ఆహ్మదాబాద్ వేదికగా మంగళవారం (జూన్ 3)న జరిగిన ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ పై ఆరు పరుగుల ఆధిక్యతతో గెలిచి విజేతగా నిలిచింది.  టాస్ కోల్పోయి తొలుత   బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ లక్ష్య ఛేదనలో చతికిల బడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేసి లక్ష్యాన్నికి ఆరు పరుగుల దూరంలో నిలిచి ఓటమిని మూటగట్టుకుంది.

ఈ విజయంతో ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలో తొలి సారిగా ట్రోఫీని అందుకుంది. 17 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన టైటిల్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ మూడు సార్లు ఫైనల్ దాకా వెళ్లి కూడా కప్ ను అందుకోవడంలో విఫలమైన ఆర్సీబీ ఈ సారి దానిని సాధించింది. ఈ సాలా కప్ నమ్ దే నుంచి ఈ సాలా కప్ నమ్ దు అని గర్వంగా చాటింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu