కాకినాడ GGH లో నలుగురు ఆర్ఎంసి ఉద్యోగులు సస్పెన్షన్

 

కాకినాడ జిల్లాలోని రంగరాయ వైద్య కళాశాల్లో లైంగిక వేధింపుల ఘటనపై  నలుగురు ఆర్ఎంసి  ఉద్యోగులు  సస్పెన్షన్ విధించారు. ల్యాబ్‌ అటెండెంట్‌ కల్యాణ్ చక్రవర్తి,  టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లను సస్పెండ్‌ చేస్తూ ధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.అజ్ఞాతంలో A1 నిందితుడు కళ్యాణ్ చక్రవర్తి ఉన్నట్లు తెలుస్తోంది.బీఎస్సీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులు చదువుతున్న విద్యార్థినులపై ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి లైంగికంగా వేధిస్తున్నారని బాధిత విద్యార్థినులు కొందరు ఫ్యాకల్టీ వద్ద చెప్పుకుని విలపించారు. 

ఇదే విషయమై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు అందడంతో ఆయన తీవ్రంగా పరిగణించి అంతర్గత కమిటీ ద్వారా విచారణ చేయించారు. మైక్రో బయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నివేదిక ఆధారంగా నిందితులను రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సస్పెండ్‌ చేసి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఎస్‌పి బిందుమాధవ్‌ మాట్లాడుతూ నిందితులను శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నామన్నారు. సంబంధిత సెక్షన్ల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu