మగాళ్లతో తిరిగా....!
posted on Nov 19, 2012 4:43PM

బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్, అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రి మధ్య ఎఫైర్ ఉందని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. నర్గీస్ ఫక్రీ అందాలకు రణబీర్ పడి పోయాడని, ఆమెతో చాటు మాటుగా ఎఫైర్ నడిపిస్తున్నాడని మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి.
నర్గీస్ ఫక్రి ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. తమ మధ్య ఎంతో అద్భుతమైన స్నేహబంధం ఉందని, ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని స్పష్టం చేసింది. మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు రణబీర్ కంటే ఎంతో హాట్‌గా ఉండే మగాళ్లతో కలిసి పని చేసాను, వారితో ఎంతో సన్నిహితంగా తిరిగాను అని తేల్చి చెప్పింది.
ఇండియాలోనే కాదు నేను వరల్డ్ ఫ్యాషన్ వేదికలపై చాలా కాలం పని చేసిన అనుభవం ఉంది. చాలా దేశాల్లో నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు, ఎవరితోనూ పడుకోలేదని చెప్పింది ఈ బ్యూటీ.