రానా రుద్రమదేవి ఫస్ట్ లుక్
posted on Dec 13, 2013 1:46PM

అనుష్క, రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "రుద్రమదేవి". ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సంధర్భంగా అనుష్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ కు భారీ స్పందన వచ్చింది. అయితే రేపు (డిసెంబర్ 14) రానా పుట్టినరోజు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో రానాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఒకరోజు ముందుగానే విడుదల చేసారు. ఈ సినిమాలో రానా నిడవర్ద్యపురం(నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడుగా కనిపించబోతున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.