ప్రేమ కిరాక్ చూపించనున్న అనిరుద్
posted on Dec 13, 2013 10:30AM

"పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డాడు" వంటి షార్ట్ ఫిలిమ్స్ లో తన నటనతో అదరగొడుతున్న అనిరుద్ హీరోగా "కిరాక్" అనే చిత్రం తెరకెక్కుతుంది."లవ్ స్టొరీ" అనేది ఉపశీర్షిక. చాందిని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా, ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. హరిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గంగపట్నం శ్రీధర్ నిర్మాత. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ... పేరుకు తగ్గట్టే సినిమా కిరాక్ పుట్టించేలా ఉంటుంది. నేటి యువత ధోరణికి అద్దం పట్టే విధంగా ఉండే ప్రేమకథా చిత్రమిది అని అన్నారు. ఈ చిత్రానికి అజయ్ అరసాద సంగీతం అందిస్తున్నారు.