‘మృత్యుంజయుడు’ రామోజీరావు స్మృతివనం!

‘మృత్యుంజయుడు’ అంటే చావును జయించినవాడు కాదు.. చావు అంటే భయాన్ని జయించినవాడు. మృత్యువును ప్రేమించిన వాడు. మృత్యువుకి హృదయపూర్వకంగా ఆహ్వానం పలికినవాడు.. అవును... రామోజీరావు మృత్యుంజయుడు. జీవితాన్ని పర్‌ఫెక్ట్.గా ప్లాన్ చేసుకున్నాడు.. తన మరణం తర్వాత జరగాల్సిన దాన్ని కూడా ప్లాన్ చేసుకున్న వ్యక్తి. ‘‘ఈ విశాల.. ప్రశాంత.. ఏకాంత సౌధంలో.. నిదురించు జహాపనా’’ అన్నట్టుగా, తాను ప్రశాంతంగా నిదురించడానికి తాను జీవించి వుండగానే ఒక సౌధాన్ని, స్మృతివనాన్ని నిర్మించుకున్న వ్యక్తి రామోజీరావు. ‘మరణం నాకు వరం.. నాకు చావు భయం లేదు’ అని సగర్వంగా ప్రకటించి, మరణం పట్ల తన గౌరవాన్ని చాటినవాడు రామోజీరావు. సువిశాలమైన రామోజీ ఫిలింసిటీ ఆవరణలోనే రామోజీరావు తాను జీవించి వుండగానే, అద్భుతమైన స్మృతివనాన్ని నిర్మించుకున్నారు. ఆదివారం నాడు ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగేది ఈ స్మారక సౌధంలోనే. తానెంతో ఇష్టపడి, తన పేరు మీద కట్టించుకున్న రామోజీ ఫిలింసిటీలోనే ఆయన ప్రశాంతంగా నిద్రించనున్నారు. అందుకే... ‘‘ఈ విశాల.. ప్రశాంత.. ఏకాంత సౌధంలో.. నిదురించు జహాపనా’’.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu