విజయ్ మాల్యాపై వర్మ కామెంట్లు.. క్యాలెండర్ గర్ల్స్‌ను ఇస్తే సరిపోతుంది..
posted on Mar 12, 2016 6:20PM

రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాస్పద వ్యాఖ్యలు.. వివాదాస్పద వ్యాఖ్యలు అంటేనే రాంగోపాల్ వర్మ.. టాపిక్ ఏదైనా కానీ.. వ్యక్తి ఎవరైనా కానీ ఏదో ఒకటి అననది రాంగోపాల్ వర్మకి నిద్రపట్టదు. తాజాగా ఆయన దేశం మొత్తం సంచలనం సృష్టిస్తున్న విజయ్ మాల్యాపై కూడా నాలుగు కామెంట్లు విసిరారు. బ్యాంకర్లు ఆయనకు ఇచ్చిన వేల కోట్ల అప్పులు కట్టే బదులు మాల్యా దగ్గర ఉన్న క్యాలెండర్ గర్ల్స్‌ని ఒక్కొక్కరినీ ఒక్కొక్క బ్యాంకుకు ఇవ్వాలని, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదని అన్నాడు. అక్కడితో ఆగాడా.మాల్యా చేసిన అప్పులతో క్యాలెండర్ గర్ల్స్ ఆస్తులు ఏమైనా పెరిగి ఉంటే మరి వారు రుణం తీర్చాలి కదా.. అని మాల్యా ఈ ఆఫరిస్తే బ్యాంకులు అంగీకరించకపోవచ్చు.. కాని బ్యాంకర్లు అంగీకరిస్తారు.. అంటూ చురకలేశారు.