ఆంధ్రా సిఎం కిడ్నాప్...కేసీఆర్ పై అనుమానం?

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిడ్నాప్ అయ్యారా?తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుమానాలు? ఇది చూసి నిజమనుకొని కంగారుపడకండి. ఇది దర్శకుడు రాంగోపాల్ వర్మ త్వరలో తీయబోయే సినిమా పేరు. “ఆంధ్రా సిఎం కిడ్నాప్” దానికి ట్యాగ్ లైన్ గా “తెలంగాణ సిఎం సస్పెక్టెడ్” అని ఉంటుందని రాంగోపాల్ వర్మ తన తాజా ట్వీట్ మెసేజు ద్వారా తెలియజేసారు.

 

ఈ సినిమా పేరు చాలా వివాదాస్పదంగా ఉంది కనుక ఇక మీడియాలో దీనిపై విస్తృతంగా చర్చ మొదలవుతుంది. రాంగోపాల్ వర్మ చాలా కాలంగా మంచి హిట్ సినిమాలు తీయడంలో విఫలమవుతున్నారు. అయినా ఈవిధంగా నిత్యం ఏదో ఒక వివాదం సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వరుసగా రెండు మూడు ఫ్లాపులు వచ్చిన దర్శకులు సినీ పరిశ్రమలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి నానా తిప్పలు పడుతుంటే, రాంగోపాల్ వర్మ వరుసగా ఇన్ని డజన్ల ఫ్లాపులు తీసి కూడా స్థిరంగా నిలదొక్కుకొని ఉండగలగడం విశేషమే. ఒకవేళ ఆయన స్థానంలో మరో దర్శకుడు ఎవరయినా ఇన్ని ఫ్లాపులు మూటగట్టుకొని ఉన్నట్లయితే, ఎక్కడా కనబడకుండాపోయేవారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu