కిషన్‌జీపై 42 క్రిమినల్‌ కేసులు

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌జీపై ఐదు రాష్ట్రాల్లో 42 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ రాజ్యసభకు తెలిపారు. వీటిలో 24 పశ్చిమబెంగాల్‌లో, 10 ఆంధ్రప్రదేశ్‌లో, 6 జార్ఖండ్‌లో, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్టల్ల్రో ఒకొక్కటి నమోదైనట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా వామపక్ష అతివాద సంస్థల్లో చీలిక రావడంతో జార్ఖండ్‌ జనముక్తి పరిషత్‌, పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, జార్ఖండ్‌ పరస్తుతి కమిటీ, ట్రిటియా సమ్మేళన్‌ ప్రస్తుతి కమిటీ, రివల్యూషనరీ కమ్యూనిస్టు సెంటర్‌ వంటి గ్రూపులు ఆవిర్భంచాయని మంత్రి వివరించారు. ప్రధాన వామపక్ష అతివాద సంస్థ సీపీఐ (మావోయిస్టు) కూడా తన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భారీగా వసూళ్లకు పాల్పడుతుందని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu