రజనీకాంత్ హిందీ పాట
posted on May 24, 2013 2:53PM

సూపర్‌స్టార్ రజనీకాంత్ మొదటిసారిగా ఓ హిందీ పాటను పాడారు. ఇప్పటికే 'కొచ్చాడయాన్' తమిళ వెర్షన్ కోసం వైరముత్తు రాసిన పాటను పాడిన ఆయన ఇప్పుడు అదే సినిమా హిందీ వెర్షన్‌లో ఇర్షాద్ కమిల్ రాసిన పాటను పాడటం విశేషం. 'లవ్ ఆజ్ కల్', 'రాక్‌స్టార్' సినిమాలతో గేయ రచయితగా ఇర్షాద్ మంచి పేరు సంపాదించుకున్నాడు. రజనీ కుమార్తె సౌందర్య డైరెక్ట్ చేసిన 'కొచ్చాడయాన్'కు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. రజనీ నమ్మకాలు, ఆయన తాత్వికత ప్రతిఫలించే రీతిలో నడిచే ఈ పాటలోని కొన్ని ఉర్దూ పదాలను పాడేందుకు మొదట కాస్త ఇబ్బంది పడినప్పటికీ రెహమాన్ ఆయన చేత వాటిని సరిగ్గా పలికించగలిగాడని సమాచారం. రజనీ మొదటిసారిగా రెండు దశాబ్దాల క్రితం 'మణ్ణన్' (1992) సినిమా కోసం ఓ పాట పాడారు.