బీజేపీకి బిగ్ షాక్.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి !?

అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ ను గద్దె దించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అనుకుని ఆ పార్టీలో చేరడం జరిగిందని, కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారడంతో తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నానని తెలిపారు. మరో ఐదు వారాల్లో కేసీఆర్ పాలన అంతం కాబోతోందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.  ఢిల్లీలలో రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
కానీ మునుగోడు లో ఏం జరుగుతుందో అన్న ఆందోళన బిజెపిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందుకు కారణం లేకపోలేదు. ఇప్పటి వరకు అనేక సార్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేయి గుర్తు మీద గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తు విషయంలో ఓటు వేసే సమయంలో ఓటర్లు అయోమయానికి గురి అవుతారేమో అన్న ఆలోచన బీజేపీ నేతలను కలవరపెడుతుంది. ఈ కారణంగా బిజెపి జాబితాలో మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పేరు ఖరారు  చేయలేదు.చాలా ఏళ్ళపాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండడం, ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం వల్ల చాలామంది వృద్ధులలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అని భావిస్తున్న పరిస్థితులు ఇంకా ఉన్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu