డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రాజా రవీంద్ర
posted on Nov 17, 2013 9:31AM
.jpg)
సిటీలో మందుబాబుల మీద ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అధికంగా బుక్ అవుతున్నాయి. అంతే కాదు ఇలా పట్టుబడుతున్న వారిలో సెలబ్రిటీలే ఎక్కువగా ఉంటున్నారు తాజా శనివారం రాత్రి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ సిని నటుడు పట్టుబడ్డాడు.
శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో బంజారా హిల్స్ ట్రాఫిక్ పోలీసులకు సినీనటుడు రాజారవీంద్ర రోడ్ నంబర్ 12లో పట్టుబడ్డారు. ఫిలింనగర్ నుంచి బంజారాహిల్స్ వైపు స్కోడా కారులో (ఏపీ 20ఏపీ 1111) ప్రయాణిస్తున్న రాజా రవీంద్రను కూడా ఆపి పరీక్షించగా, ఆయన మద్యం సేవించినట్లు తేలింది. పోలీసులు ఆయన కారును స్వాధీనం చేసుకుని, ఆయనపై కేసు నమోదు చేశారు.