క్షమాపణ చెప్పడానికి సావర్కార్ ను కాదు.. రాహుల్ ని

అనర్హత వేటు అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు. మోడీని విమర్శించినందుకు జైలుకు వెళ్లాల్సి వస్తే మళ్లీ మళ్లీ విమర్శిస్తానని అన్నారు. భయపడి క్షమాపణలు చెప్పి పారిపోయేందుకు తాను సావర్కార్ ను కాదని అన్నారు.

తాను రాహుల్ గాంధీనని చెప్పిన ఆయన తనలో ప్రవహించేది దేశంలోని సర్వజనుల స్వాతంత్ర్యం కోసం క్షమాపణ చెప్పకుండా జైలుకు వెళ్లిన వారి కర్తమని అన్నారు. తలవంచను, తగ్గను సకల జనుల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం తగ్గేదేలేదని రాహుల్ అన్నారు.  

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు,   వయనాడ్ లోక్‌సభ సభ్యుడు రాహుల్‌గాంధీని  లోక్‌సభ సెక్రటేరియట్ డిస్‌క్వాలిఫై చేసిన సంగతి విదితమే,    ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించిన నేపథ్యంలో రాహుల్ పై అనర్హత వేటు పడింది.  

ఆయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడంటూ లోక్ సభ సెక్రటేరియెట్  ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ అనర్హత వేటుకు, జైలుకు వెళ్లడానికి భయపడే ప్రశక్తే లేదని పేర్కొన్నారు.