రాహుల్ పాదయాత్ర ప్రారంభం

 

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రైతు భరోసా యాత్ర తెలంగాణలోని కొరిటికల్‌ నుంచి ప్రారంభమైంది. కొరిటికల్ నుంచి వడ్యాల వరకు 15 కిలోమీటర్ల దూరం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు. కొరటికల్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు రాజేశ్వర్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా పరామర్శిస్తారు. లక్షణ్‌చందా, పొట్టపల్లి, రాచపూర్ మీదుగా ఆయన పాదయాత్ర జరుగుతుంది. రాహుల్ గాంధీ తన పాదయాత్ర సందర్భంగా దారిలో రైతులను కలసి వారి నుంచి వినతులు స్వీకరిస్తారు. వారితో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu