కుటుంబాన్నే చంపేశాడు
posted on May 15, 2015 10:46AM

శుక్రవారం నాడు వరల్డ్ ఫ్యామిలీ డే. కుటుంబ ప్రాధాన్యాన్ని తెలిపే రోజు. కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పే రోజు. కుటుంబానికి సంబంధించి ఇంత ప్రాధాన్యం వున్న ఈ రోజున హైదరాబాద్‌లో ఓ కిరాతకుడు తన కుటుంబాన్నే చంపేశాడు. హైదరాబాద్‌లోని బాలాపూర్ ప్రాంతంలో వున్న సాయినగర్‌తో ఈ ఘోరం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో సమ్మిరెడ్డి రామిరెడ్డి అనే వ్యక్తి తన తల్లి సుభద్ర (65), భార్య రాధిక (40), కుమార్తె అక్షయ (14)లను కత్తితో గొంతు కోసి చంపేశాడు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ఈ ముగ్గర్నీ చంపేసిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఘటనా స్థలం నుంచి పరైరయ్యాడు. తర్వాత ఓ బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలు జరిగిన సమయంలో హంతకుడి పెద్దకూతురు ప్రత్యూష ఇంట్లో లేకపోవడంతో బతికి బయటపడింది.