రాహుల్ గాంధీ పొగిడాడా..! తిట్టాడా..!
posted on Jul 30, 2016 9:53AM

ఒక పార్టీ నేతను, ఇంకో పార్టీ నేత పొగడటం చాలా అరుదు. అలాంటిది పార్టీకే ఉపాధ్యక్షుడు అయినా రాహుల్ గాంధీ ఇప్పుడు ఓ నేతపై ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా.. ఎవరో కాదు.. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పై. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ఇప్పటినుండే మంచి కసరత్తు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే రాహుస్ గాంధీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార భేరిని మోగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘యువ ముఖ్యమంత్రిని చూడండి. ఆయన మంచి బాలుడు అంటూ పొగిడారు. అయితే ఆయనను ప్రశంసించారు కానీ.. ఆయన ప్రభుత్వ తీరుపై మాత్రం విమర్శలు చేశారు. ఎస్పీ ప్రభుత్వం హయాంలో యూపీలో శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయని.. ఒకవైపు బీఎస్పీ అవినీతిని ప్రోత్సహిస్తుంటే, మరోవైపు ఎస్సీ గూండాగిరిని ప్రోత్సహిస్తున్నదని.. ఆయన ప్రభుత్వం ఏ మాత్రం పనిచేయడం లేదని ఎద్దేవ చేశారు.