"టోరీ" కిర్తీ కిరీటంలో మరో కలికితురాయి
posted on Jul 29, 2016 8:38PM

ప్రపంచంలోని తెలుగువారందరిని ప్రతి రోజు పలకరిస్తున్న తెలుగువారి ఆత్మీయ వారథి తెలుగువన్ రేడియో (టోరీ) కిర్తీ కిరీటంలో మరో కలికితురాయి చేరింది. భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగిన 10 ఎఫ్.ఎం రేడియాల్లో టోరీ ఒకటిగా నిలిచింది. ప్రముఖ ఆన్‌లైన్ రేడియో వెబ్‌సైట్ "రేడియో గైడ్ " నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్ కేంద్రంగా తెలుగులో తొలి ఆన్‌లైన్ రేడియోగా టోరీని ప్రారంభించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు టోరీ ఎండీ కంఠమనేని రవిశంకర్. ఆయన సారథ్యంలో విభిన్న కార్యక్రమాలతో నిత్యనూతనంగా మారుతూ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి మనసుల్ని గెలుచుకుంది టోరీ. సుమారు 110 దేశాల్లోని తెలుగువారిని అలరించడమే కాకుండా వారి అనుబంధాల్ని, అంతరంగాల్ని ఏకం చేస్తోంది టోరీ.
.jpg)