రాహుల్ గాంధీ చిన్నపిల్లాడు.. ఎవరూ పట్టించుకోరు.. ఆజంఖాన్

చాలా సంవత్సరాల రాజకీయానుభవం ఉన్నా గానీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సెటైర్లు తప్పవు. ఇప్పటికి చాలా మంది నేతలే రాహుల్ పై వ్యంగ్యంగా మాట్లాడారు. ఇప్పుడు సమాజ్‌వాదీ నేత ఆజంఖాన్ కూడా ఆ జాబితాలో చేరారు. రాహుల్‌ గాంధీ ఇంకా చిన్న పిల్లాడేనని, అతడి మాటలను ఎవరూ పట్టించుకోరని ఆయన అన్నారు. రాహుల్‌ గాంధీ చాక్లెట్లు తింటూ, కొన్నింటిని మిగిలిన 'చిన్న పిల్లల'కు పంచిపెట్టాలని సూచించారు.

కాగా రాహుల్‌గాంధీ శనివారంనాడు బుందేల్‌ఖండ్‌లో పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. ముడి చమురు ధరలు తగ్గిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదా చేసుకున్న నిధులనుంచి కొంత భాగాన్ని కరవు దెబ్బ తిన్న ప్రాంతాలకు కేటాయించాలని రాహుల్ డిమాండ్‌ చేశారు. దీంతో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆజంఖాన్‌ పైవిధంగా స్పందించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu