చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

 

ఏపీ సీఎం చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. గోదావరి మహాపుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్ల పర్యవేక్షణకు వెళ్లిన చంద్రబాబు లాంఛీకి ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం... శుక్రవారం చంద్రబాబు, మంత్రులు ఉన్నతాధికారు దాదాపు రెండు గంటల పాటు ప్రత్యేక బోటులో గోదావరి పర్యటించి పుష్కర ఘాట్లను పర్యవేక్షించడానికి వెళ్లగా.. వారితో పాటే ఇంకో బోట్ లో మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారు. అయితే టూరిజం బోటు ప్రాంతం నుంచి విఐపి ఘాట్, సరస్వతీ ఘాట్, గౌతమీ ఘాట్‌లను పరిశీలించి కొవ్వూరు వస్తుండగా అదే సమయంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న లాంచీని మీడియా లాంచ్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా అధికారులు ఉలిక్కిపడ్డారు. అయితే ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు కానీ మీడియా బోటు స్వల్పంగా దెబ్బతింది. కాగా కోటి లింగాల రేవు ఘాట్ వద్ద కూడా సీఎం లాంచి మట్టిలో చిక్కుకొని ఓవైపు ఒరిగిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu