కరవు ప్రాంతాలలో సమృద్ధిగా వర్షాలు కురవాలి.. చిరపుంజిలో రఘువీరా ప్రార్థన

అసోంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చిరపుంజిలో ప్రకృతి సోయగాలకు మైమరిచిపోయారు. రాయలసీమలో పుట్టిన రుఘువీరా ఏడాది పొడవునా వర్షం కురిసే చిరపుంజిలో పర్యటన ఎంతో ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు.

ఏడాదిలో 365 రోజులూ వర్షం కురిసే చిరపుంజిని చూసి సంతోషంగా ఉందని తన అసోంపర్యటనకు సంబంధించి విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. కరువు ప్రాంతాలన్నిటిలోనూ సమృద్ధిగా వర్షాలు కురవాలని చిరపుంజి వేదికగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పిన రఘువీరా.. ఆ వీడియోలో తన పర్యటన విశేషాలను వివరించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu