తిరుమలలో ప్రయివేటు అతిథి గృహాల పేర్ల మార్పు

తిరుమలలో గోవిందనామస్మరణ మాత్రమే వినిపించాలి, ఆధ్మాత్మిక వాతావరణమే కనిపించాలి అన్న ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రయివేటు అతిథి గృహాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు సంస్థలు, వ్యక్తులు తిరుమలలో నిర్మించిన అతిథి గృహాలకు తమకు నచ్చిన పేర్లను నమోదు చేశారు. అయితే ఇటీవల పాలకమండలి సమావేశంలో ప్రయివేటు అతిథి గృహాల పేర్లు ఆధ్యాత్మికంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.

దీనికి అనుగుణంగా తొలివిడతలో 42 అతిథి గృహాల పేర్లను మార్చారు . ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆదేశాలు జారీచేసింది. తిరుమలలో  ఆధ్యాత్మిక శోభ మరింతగా పరిఢవిల్లడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది.  తిరుమలలో శ్రీవారి పేర్లు, గోవింద నామస్మరణ మాత్రమే వినిపించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాతల సొంత పేర్లు ఉన్న 42 విశ్రాంతి భవనాలకు మార్చిన పేర్లను టీటీడీ ప్రకటించింది.
అలా మారిన కొన్ని అతిథి గృహాలు పేర్లు ఇలా ఉన్నాయి.  జిఎంఆర్ విశ్రాంతి భవనానికి ఆనంద నికేతనం, మాగుంట నిలయం కు రాఘవ నిలయం, మైహోమ్ పద్మప్రియ కు పద్మప్రీయ నిలయం, సుధాకృష్ణ నిలయంకు వైకుంఠ నిలయం, శ్రీ రచన   గెస్ట్ హౌస్ కు విధాత నిలయం, పాండవ విశ్రాంతి భవనం  విరజా నిలయంగా పేర్లు మార్పు చేసారు  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu