ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..అమరావతి నిర్మాణ పనులపై చర్చ

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ  ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ.. కేంద్ర నిర్ణయానికి కూటమి ప్రభుత్వం మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధానిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. సుమారు రూ. లక్ష కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రోడ్‌మ్యాప్‌ తయారు చేసింది.వెలగపూడి సచివాలయం వెనక అమరావతి పునఃప్రారంభ పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అదే రోజు రోడ్‌షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో దాదాపు 30 వేల మంది పాల్గొంటారని అంచనా. రూ.లక్ష కోట్ల పనుల ప్రారంభ సూచికగా ప్రధాని మోదీ.. పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ప్రధానితో భేటీ సమయంలో అమరావతి, ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. 

వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా అమరావతి పునర్నిర్మాణానికి అవసరమైన తోడ్పాటును అందించాలని ప్రధానిని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం సహకరించాలని ఆయన కోరారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యేందుకు అంగీకరించారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే రోజున దాదాపు 30 వేల మందితో ఒక రోడ్‌షో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.