బ్రాంకైటిస్ ఆస్తమా...

ఊపిరి తిత్తుల్లో కి గాలిని గాలిని తీసుకు వెళ్ళే నాళా లు బ్రాంచి అదే బ్రాంచి కి ఇన్ఫెక్షన్ వస్తే దానిని బ్రాంకైటిస్అంటారు. ఈ ఇన్ఫెక్షన్ ఒక రక మైన 
బ్యాక్టీరియా లేక వైరస్ వల్ల వస్తుంది. కొద్ది రోజులు జలుబు తరువాత ఆకస్మాతుగ్గా రావచ్చు ఇదే మెల్లిగా అక్యూట్ బ్రాంకైటిస్ గా  సంవత్సరాల తరబడి మాటి మాటికీ వస్తు ఉండవచ్చు. దీర్ఘ కాలంగా రావడం వల్ల శ్వాస నాళాలు, శ్వాస కోశాలు క్రమంగా చెడిపోతాయి. బ్రాంకైటిస్ కొందరు మనుషులకు తేలికగా సోకుతుంది. కొందరికి అసలు రాదు కారణం తెలియదు. బ్రాంకైటిస్ స్త్రీల కంటే పురుషులకు ఎక్కువగా వస్తుంది.
1౦ మంది పురుషులకు ఒక స్త్రీ కి చొప్పున బ్రాంకైటిస్ రావడానికి పొగ తాగని వాళ్ళ కంటే పొగ తాగే వాళ్ళకు5౦ రెట్లు అవకాశాలు ఉన్నాయి. బ్రాంకైటిస్ లో రెండు రకాలు ఉన్నాయి. అక్యుట్ బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్

అక్యూట్ బ్రాంకైటిస్--లక్షణాలు..

     విడవ కుండ దగ్గు.
      పిల్లి కూతలు
      కఫం లో చీము వుండి  ఆకుపచ్చ లేక పసుపు పచ్చ  తెమడ పడుతుంది. 
       ఆయాసం , ఆకలి లేక పోవడం , తల నొప్పి జ్వరం 
 

ఎంత కాలం ఉంటుంది ?...

వారం నుంచి మూడు వారాల దాకా వుంటుంది. ఇతరత్రా ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు దానికి అదే తగ్గి పోతుంది.

బ్రాంకైటిస్ కారణాలు...

 శ్వాస నాళాల లోకి ప్రవేశించిన రక రకాల సూక్ష్మ క్రిములు వైరస్ లు బ్యాక్టీరియా ఊపిరి తిత్తులోకి చేరుకుని, ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. శ్వాస నాళాల లోని పొరలు ఉబ్బి శ్వాసమార్గాన్ని  ఇరుకు చేస్తాయి. దానితో బయటికి పోవాల్సిన తేమడకు ఆటంకం కలుగు తుంది. ఆ తెమడను బయటికి పంపడానికి ఒకటే దగ్గి దగ్గి ఆయాస పడిపోతారు.

కాంప్లికేషన్స్..

బ్రాంకైటిస్ తీవ్రంగా ఉంటె సీరియస్ అయితే మరీ చిన్న పిల్లలకు మరీ పెద్ద వయస్సు వాళ్ళకు న్యుమోనియాలోకి దింపే ప్రమాదం ఉంది.

ఇంట్లో వైద్యం...

వెచ్చటి వాతావరణాన్ని  కల్పించుకుని రాత్రి పగలుఇంట్లోనే రెండు మూడు రోజుల పాటు రెస్టు తీసుకోడం మంచిది. వేడి వేడి పానీయాలు పుష్కలంగా తాగాలి.

డాక్టర్ ను ఎప్పుడు కలవాలి...

శ్వాస పీల్చుకోడం మరీ ఇబ్బందిగా ఉండి దగ్గు తున్నప్పుడు చాతిలో నెప్పిగా ఉన్నట్టు గా వుంటే
రోగి మరీ వృద్ధుడు లేదా మరీ చిన్న వాడు అయి వుంటే. డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళాలి.

డాక్టరెం  చేస్తాడు...

శారీరక శ్రమ లేకుండా ముందు విశ్రాంతి తీసుకోమంటారు. దాని వల్ల ఇన్ఫెక్షన్ ఊపిరి తిత్తుల్లోకి జొరబడ కుండానూ తద్వారా న్యుమోనియా లోకి డింప కుండా వుంటుంది. న్యుమోనియా ప్రమాదం ఉన్నదనుకుంటే యాంటీ బాయిటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు.దగ్గు తెరలు తెరలు గా వస్తుంటే దగ్గుమందు రాసిస్తారు.

నివారణకు ఏమి చెయ్యాలి...

పొగ తాగడం మానెయ్యాలి. చిన్న పిల్లలు వృద్ధులు చల్లగా ఉండే పడక గదిలో పడుకోకూడదు. జలుబు చేసిన వాళ్ళకు, చస్ట్ ఇన్ఫెక్షన్ వున్న వాళ్ళకు దూరంగా వుండాలి. అక్యుట్ బ్రాంకైటిస్ మూలంగా తర్వాత ఏర్పడే పరిణామాలంటూ ఏమి ఉండవనే చెప్పాలి.